చంద్రగిరి:
చంద్రగిరి జాతీయ రహదారి వద్ద కాటా వద్ద మామిడి కాయల మండీని గురువారం ప్రారంభించారు. చంద్రగిరిలో గత పది సంవత్సరాలకు పైగా మామిడికాయల మండీ నిర్వహిస్తూ, ఇతర మండీల మాదిరిగా కాకుండా సూట్, కమిషన్ ఇలాంటి లేకుండా రైతులకు మామిడి కాయలు లోడ్డు తీసుకురాగానే అప్పటికప్పుడు ఆరోజు ధర ప్రకారం నగదు చెల్లిస్తున్నామని ప్రొప్రైటర్ పులిపాటి హేమాద్రి తెలిపారు. అదేవిధంగా మామిడి రైతులు సంవత్సరకాలం పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తూ, రైతుల ఆదరాభిమానాలు పొందుతున్నామని పేర్కొన్నారు. కావు ఈసంవత్సరం కూడా చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, వెదురుకుప్పం, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు మండలాల్లో మామిడి రైతులకు అందుబాటులో ఉన్నామని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్..98660056790, 7983056790 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

