మల్లి సాలలోఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలోప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట :సంక్షేమం,అభివృద్ధే తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం లక్ష్యమని జగ్గంపేట శాసనసభ్యులు అన్నారు.కూటమి ప్రభుత్వం వందరోజులు పూర్తయిన సందర్భంగా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. మల్లిశాల చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు గ్రామ మాజీ సర్పంచ్ పైడిపాల చంద్రావతి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి వారి ఇంటి వద్ద తేనీటి విందు ఇచ్చారు. అనంతరం సెంటర్ గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సర్వసిద్ధి నూకరత్నం లక్ష్మణరావు దంపతులు ఘన స్వాగతం పలికే సభకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంద రోజుల పాలన దిగ్విజయంగా జరిగిందని అన్నారు.ఆర్ధిక కష్టాలను అధిగమించి ఒకటవ తారీఖునే పెన్షన్,ఉద్యోగులను జీతాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.వంద రోజుల్లోనే ప్రజల మనసులు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమం పోటాపోటీగా చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల నుంచి ఇళ్ల స్థలాలు, డ్రైనేజీలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, కొండ పోడు పట్టాలు, హౌసింగ్ లోన్స్ వంటి సమస్యలు తెలియజేయడంతో వాటన్నిటిని పరిష్కరించుకుంటూ వెళ్తామని ముఖ్యంగా మంచినీళ్లు చెరువు శుభ్రం చేసి వాడుకులోకి తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, అత్తులూరి నాగబాబు, మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, సర్పంచ్ సర్వసిద్ధి నూక రత్నం లక్ష్మణరావు, ఎంపీటీసీ కానవరెడ్డి సూర్య కుమారి రామకృష్ణ, రేఖ బుల్లి రాజు, ముండ్రు ఎర్రబాబు, పైడిపాల సత్తిబాబు, సియాదుల పెద్దకాపు, తొట్టిపూడి నాగేశ్వరరావు, ఉపసర్పంచి ముద్ద రాజబాబు, చావా వెంకన్న బాబు, పొగరు యేసు,, నకిరేడ్డి సూర్యవతి, అనంతలక్ష్మి, ఎమ్మార్వో, ఎండిఓ, ఏపీఓ, మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.