డ్వాక్రా మహిళల ఆవేదన మా డబ్బులు ఎక్కడ ఏ పి ఎం ను కలిసిన మహిళలు

ఒంటిమిట్ట:మండల కేంద్రమైన సిద్దవటం దిగోపేట గాంధీ వీధిలో ఉన్న మహిళా సమాఖ్య పొదుపు సంఘం పద్మావతి ఎస్ హెచ్ డి గ్రూప్ సభ్యులు సోమవారం మండల సమాఖ్య ఏపిఎం వెంకటేశ్వర్లు కలిసి పొదుపు సంఘంలో జరిగిన అన్యాయంపై ఆయనకు వివరించారు వివరాల్లోకెళితే గాంధీ వీధిలో ఉన్న వనంవెంకటమ్మ అనే సభ్యురాలు పొదుపు సంఘంలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2 లక్షలు లోను మంజూరు అయితే మా దగ్గర సంతకాలు పెట్టించుకుని మాకు ఇవ్వలేదని ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందని అధికారులు సమగ్ర విచారణ చేయాలని ఆమె అన్నారు వనం వెంకటమ్మ అనే మహిళకు నీకు వయసు అయిపోయింది నీకు లోను మంజూరు కాలేదంటూ కితాబు ఇచ్చారని లోను మంజూరు కానప్పుడు నా దగ్గర సంతకాలు ఎందుకు పెట్టించుకున్నారని ఆమె అధికారులకు తెలియజేశారు మాకు మంజూరు చేసిన పుస్తకాలలో ఎక్కడ కూడా ఎంట్రీ లేదని ఆమె తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అక్క చెల్లి లక్షాధికారి కావాలని ఉద్దేశంతో చేయూత ఇస్తూ ఉంటే ఇక్కడ మాకు అన్యాయం జరుగుతూ ఉందని తెలియజేశారు అధికారులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని అన్నారు మండల సమాఖ్య ఏపిఎం వెంకటేశ్వర్లను వివరణ కోరగా వెంకటమ్మ అనే సభ్యురాలికి రావలసిన డబ్బు ఎవరి అకౌంట్ లో అయినా పడిందా సమగ్ర విచారణ జరుపుతామని గ్రూప్ సభ్యులతో సంఘ సభ్య సమావేశం జరిపి అందరి అకౌంట్లు వెరిఫికేషన్ చేసి నిజాలు తెలియజేస్తామని అన్నారు

