Thursday, September 11, 2025

Creating liberating content

సినిమాన‌టుడిగా మారిన ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న‌యుడు

న‌టుడిగా మారిన ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న‌యుడు

ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఎస్పీ చరణ్. కెరీర్ మొదట్లో చరణ్.. కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. ఇప్పుడు మరోసారి నటుడిగా ఆన్ స్క్రీన్ కనిపించడానికి సిద్ధమయ్యారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘లైఫ్ లవ్ యువర్ ఫాదర్’ . తండ్రీ, కొడుకుల మధ్య అనుబంధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్పీ చరణ్ తండ్రి పాత్రలో నటించనున్నారు.సింగ‌ర్‌గా ద‌క్షిణాది భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఆల‌పించాడు చ‌ర‌ణ్‌. నిర్మాత‌గా ప‌దికిపైగా సినిమాలు నిర్మించాడు. అత‌డు ప్రొడ్యూస్ చేసిన అర‌ణ్య కాండం మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకున్న‌ది. న‌టుడిగా, హోస్ట్‌గానే కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా కొన్ని సినిమాలు నిర్మించాడు. తండ్రి ఎస్‌.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణించ‌డంతో అత‌డి స్థానంలో పాడుతా తీయ‌గా సినిమాకు హోస్ట్‌గా ఎస్‌.పి. చ‌ర‌ణ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.
ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్ అన్న‌ది ఈ మూవీ క్యాప్ష‌న్‌. ఈ సినిమాలో దివంగ‌త గాయ‌కుడు ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం త‌న‌యుడు ఎస్‌.పి. చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ టాలీవుడ్ మూవీతో ప‌వ‌న్ కేత‌రాజు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.తండ్రీకొడుకుల మ‌ధ్య ఉన్న ఎమోష‌న్‌ను, బాండింగ్‌ను స‌రికొత్త‌గా చూపించే మూవీగా ల‌వ్ యువర్ ఫాదర్ ఉంటుంద‌ని నిర్మాత‌లు అన్నారు. మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు చెప్పారు. ఈ సినిమాలో తాను మేఘన అనే క్యారెక్ట‌ర్ చేస్తున్న హీరోయిన్ రియా చెప్పింది. నిర్మాత‌ల జీవితాల్లో జ‌రిగిన చిన్న చిన్ని ఇన్సిడెంట్ ని తీసుకొని డెవ‌ల‌ప్ చేసుకున్న క‌థ ఇద‌ని డైరెక్ట‌ర్ చెప్పాడు. తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ తో పాటు శివోహం కాన్సెప్ట్‌ను ఇందులో ట‌చ్ చేశామ‌ని అన్నాడు. హీరో తండ్రిగా ఎస్‌.పి చ‌ర‌ణ్ ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు డైరెక్ట‌ర్ పేర్కొన్నాడు9. ఈ సినిమాలో ప్ర‌వీణ్‌, భ‌ద్రం, న‌వాబ్ షా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
ఎల్ వై ఎఫ్ మూవీని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తోన్నాయి. మనీషా ఆర్ట్స్ సంస్థ గ‌తంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదంతో పాటు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాల‌ను నిర్మించింది. ఎల్ వై ఎఫ్ మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత తిరిగి సినిమా ప్రొడ‌క్ష‌న్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ల‌వ్ యువ‌ర్ ఫాద‌ర్ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవ‌ల‌ మల్లారెడ్డి కాలేజీలో జ‌రిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article