Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలులింగాలగట్టు సమీపంలో.. నీటిలో ఒకరు గల్లంతు

లింగాలగట్టు సమీపంలో.. నీటిలో ఒకరు గల్లంతు

శ్రీశైలం డ్యాం వంతెన సమీపంలో కృష్ణాలో ఒకరు గల్లంతైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శ్రీశైలం డ్యాం దిగువ భాగాన లింగాలగట్టు పెద్దవంతన సమీపంలో ఈతకొడుతూ వ్యక్తి నదిలో గల్లంతయ్యారు. అందరు చూస్తుండగానే వ్యక్తి నీటిలో కొట్టుకపోవడం గమనార్హం.గల్లంతైన వ్యక్తి నల్గొండ జిల్లా పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన యాదయ్య (48) గా గుర్తించారు. శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు స్నేహితులతో కలిసి శ్రీశైలం వచ్చారు. ఈ క్రమంలో ఈతకొడుతూ నీటిలో గల్లంతయ్యారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article