పులివెందుల :భ్రూణ హత్యలకు అడ్డుకట్ట వేద్దాం ఆడ శిశువుల ను బతకనిద్దామని ఆర్డిఓ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పులివెందుల రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఆర్ డి ఓ ఛాంబర్ లో సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ అడ్వైసర్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భం లోని శిశువు ఆడ అని తెలిసి బయటకు బహిర్గతం చేయడం చట్ట రీత్యా నేరం అని ఆడ శిశువుకి జన్మ నివ్వాలి, ఆడబిడ్డ లను చదివించాలి తద్వారా ఆడబిడ్డల అభివృద్ధి సమాజం లోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు భ్రూణ హత్యల నివారణ కొరకు స్కానింగ్ కేంద్రాల పై పూర్తి స్థాయి నిఘా ఉంచాలని. అలాగే కలాజాత బృందాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టా లని. గర్భ శ్రావం కొరకు వాడే మాత్రలను డాక్టర్ సిఫార్సు లేకుండా మందులు ఇచ్చే మందుల దుకాణం లను మరియు ఏజెన్సీల పై కఠిన చర్య లు చేపట్టాలని, అంగన్వాడి సిబ్బంది ని కూడా కార్యక్రమం లో భాగస్వామ్యం చేయాలన్నారు. బే టీ బచావో… భేటీ పడావొ కార్యక్రమాలు చురుకు గా చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖాజా మొయిద్దీన్, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీలత,డాక్టర్ వైయస్ఆర్ సర్వజన ఆసుపత్రి గైనకాలజస్ట్ డాక్టర్ అనన్య, రేడియాలాజిస్ట్ డాక్టర్ షాలిని, నగరిగుట్ట, బాకరా పురం పట్టణ ప్రాథమిక వైద్యశాలల వైద్యులు డాక్ట ర్ స్నేహ ప్రత్యూష, డాక్టర్ శాంతి కుమార్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి హేమలత, సీనియర్ అసిస్టెంట్ నరేష్ సీనియర్ డి ఈ ఓ బాషా తదితరులు పాల్గొన్నారు.