హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నిపుణులైన డాక్టర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. గాంధీ దవాఖానకు ఈ కమిటీని వెళ్లకుండా అడ్డుకోవడంపై ప్రశ్నిస్తూ, వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో నిలదీశారు.కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రంలో వైద్య రంగంలో వాస్తవ పరిస్థితులను బయటకు తీసుకువచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ముఖ్యంగా, గాంధీ దవాఖాన సహా ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కమిటీకి అవకాశం ఇవ్వకుండా, కాంగ్రెస్ సర్కార్ పోలీసులు ఉపయోగించి అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. కమిటీ నేతృత్వంలో ఉన్న డాక్టర్ రాజయ్యను హౌస్ అరెస్టు చేయడం, గాంధీ దవాఖాన వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి.