టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ఓ నెటిజన్ తనకు ‘హనుమాన్’ కంటే లెజెండరీ దర్శకుడు కృష్ణవంశీ తీసిన ‘శ్రీ ఆంజనేయం’ బాగా నచ్చింది. ఎందుకో తెలీదు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది అని నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై తాజాగా కృష్ణవంశీ ఎక్స్ వేదికగా రిప్లయ్ ఇచ్చాడు.‘శ్రీ ఆంజనేయం’ సినిమా ప్లాప్ అవ్వడం విషయంలో ఆడియన్స్ ఎప్పుడూ తప్పు చేయలేదు.. వారికి సినిమా నచ్చలేదు అంటే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు లేదా ఆ సినిమా చేరువకావడంలో సమస్య ఉండి ఉండవచ్చు. అందుకే ఆడియన్స్‌ను నిందించొద్దు. కొన్ని అంశాల విషయంలో నేను తప్పు చేసి ఉండవచ్చు అంటూ కృష్ణవంశీ రాసుకోచ్చాడు. కాగా ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.