Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ మిల్లుల లక్ష్యాలు సాధించాలి

ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ మిల్లుల లక్ష్యాలు సాధించాలి

  • కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం :ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ ఆటంకం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ సమన్వయ శాఖల, మిల్లర్లు ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ అక్టోబరు నెలలో ప్రారంభించనున్న దృష్ట్యా, క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలు అక్టోబర్ 2 వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు.  ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభం అయిన తదుపరి సమస్యల లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్, ఈ కె వై సీ ల ప్రక్రియ నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మండల స్థాయి అధికారులు ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, మినిట్స్ అందచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు.  మిల్లుల తనిఖీలో సామర్ధ్యం తో పాటు గత సీజన్లలో పెండింగ్ బకాయిల, సి ఎస్ ఆర్ మిల్లర్ల లక్ష్యాలను, సమస్యల పై నివేదిక అందచేయాలని జిల్లా కలెక్టర్ తెలియ చేశారు. ఆర్డీవో ల ఆధర్వ్యంలో సూపర్ చెక్ పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుందని, రైతులకి సమీపంలో ఉన్న మిల్లును ట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. డివిజనల్ స్థాయిలో మండల , కొనుగోలు కేంద్రాల అధికారులకు, సిబ్బందికి శిక్షణ నిర్వహించమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. వి ఏ ఏ లు, సాంకేతిక సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మండల అధికారులు క్షేత్ర స్థాయిలో మిల్లుల సామర్థ్యం తనిఖీలు నిర్వహించినివేదిక అందచేయాలని పేర్కొన్నారు. మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు కర్రీ వెంకట రెడ్డి, మద్దూరి రామయ్య, గారా బాబురావు, ఎస్. జనార్ధన రావు, యు పి ఎస్ ఎన్ మూర్తి, ఆర్డీవో లు కే ఎస్ శివ జ్యోతి, ఆర్..కృష్ణ నాయక్, జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, డి ఎమ్ (సి ఎస్) టి. రాధిక, ఇంచార్జీ డి ఎస్ వో  ఎమ్. నాగంజనేయులు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article