టీడీపీ నేతలు, ముఖ్యంగా మంత్రి లోకేశ్‌ను కలిసి, కొన్ని కీలక అధికారుల పోస్టింగ్‌లను రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ, కొన్ని కీలక పోస్టింగ్‌లు వైసీపీ నేతలకు సన్నిహితంగా ఉన్న అధికారులకు లభిస్తుండటం టీడీపీ వర్గాల్లో ఆందోళనకు దారితీస్తోంది.ఉదాహరణగా, నాటి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రతాప్ రెడ్డికి కర్నూలు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పోస్టింగ్ లభించగా, వైసీపీ హయాంలో కర్నూలు ప్రాంతీయ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన తిరుమలేశ్వరరెడ్డి ప్రస్తుతం విజయవాడ నగర డీసీపీ (క్రైం) గా నియమితులయ్యారు.ఈ పరిణామాలు టీడీపీ నేతల్లో అసంతృప్తి కలిగించాయి. కొందరు ఈ అధికారుల గత చరిత్రను పరిశీలించి, వారి గత అక్రమాల గురించి వివరాలు అందజేస్తూ మంత్రి లోకేశ్‌కు లేఖ రాశారు. మరికొందరు నేరుగా లోకేశ్‌ను కలిసి, ఈ పోస్టింగ్‌లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.