Thursday, February 12, 2026

Creating liberating content

సినిమా'కన్నప్ప' కోసం రంగంలోకి ప్రభుదేవా!

‘కన్నప్ప’ కోసం రంగంలోకి ప్రభుదేవా!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. ప్రభుదేవా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కన్నప్ప’ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్‌ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని ‘కన్నప్ప’ మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. అయితే ‘కన్నప్ప’ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు కన్నప్ప టీమ్ స్వాగతం పలికింది.న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ తదితరులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article