కామవరపుకోట

రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాల పైన సెమినార్ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని సుదర్శన రామ దుర్గాచార్యులు ఉత్తమ అవార్డు దైవిజ్ఞ రత్న అవార్డు అందుకున్నారని సుదర్శనం శ్రీనివాసచార్యులు చెప్పారు.
విశాఖపట్నంలో డైమండ్ పార్కు వద్ద ఉన్న హోటల్ రిస్ట్ కంపార్ట్ గ్రాండ్ హోటల్ లో జరిగిన విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ వారిచే నిర్వహించిన సెమినార్లో జ్యోతిష్యం వాస్తు మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దాన్ని అనుసరించి దైవజ్ఞరత్న అనే బిరుదుని ప్రదానం చేశారు.దుశ్శాలువా, జ్ఞాపిక మరియు సర్టిఫికెట్ ఇచ్చి అదిరథమహారధుల మధ్య సత్కరించిరించారు. కామవరపుకోటలో పీఠం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతను కామవరపుకోటలోని అభినందించారు. ఆయనకు జిల్లాలోని అభినందనలు తెలుపుతున్నారు.