రామచంద్రపురం :జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల 21 మండలాల నుండి మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం , డిబేట్ కాంపిటీషన్స్ కాజులూరు ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధినులు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి పొందినట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పంపిన కృష్ణ మూర్తి తెలిపారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన. ఆ కాంపిటీషన్స్ లో డిబేట్ కాంపిటీషన్లో పాల్గొన్న తమ కాజులూరు ఉన్నత పాఠశాల నుండి నుండి మామిడాడ శిరీష, సలాది ధనేశ్వరి అనే ఇద్దరు విద్యార్థినిలు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి (3000 నగదు) పొందాలన్నారు.

రూరల్ ప్రాంతంలో చదువుతున్న మా పాఠశాల విద్యార్థులు అర్బన్ ప్రాంతం విద్యార్థులతో పోటీపడి అన్ని పోటీలలో బహుమతులు గెలవడం మా పాఠశాలకు గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ద్వితీయ స్థానం పొందిన విద్యార్థినిలను వారికి తర్ఫీదు నిచ్చి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ఫస్ట్ అసిస్టెంట్ జె.శామ్యూల్ బెన్ హర్, సీనియర్ ఉపాద్యాయులు కె.వి.వి. సత్యనారాయణ, స్టాఫ్ సెక్రటరీ కె. హరినాథ్, చింతా నారాయణ మూర్తి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పెంటపాటి పద్దరాజు, గ్రామస్తులు ఈసందర్భంగా అభినందించారు.