జగ్గంపేట :పేద కుటుంబాలలో ఆడబిడ్డలకు వివాహం జరిపించే సమయంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని లక్ష్యంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఆనందంగా ఉందని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో కొత్తపల్లి రమణ కుమార్తె కొత్తపల్లి అనూష, మాస భూషణరావు వివాహ వేడుకకు హాజరైన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి నూతన దంపతులకు 20 వేల రూపాయలు చెక్కును అందించారు. పేద ఇంటి ఆడబిడ్డ పెళ్ళికి 9 రోజుల ముందు ఫౌండేషన్ కార్యాలయం వివరాలు నమోదు చేసుకుని తెలియజేస్తే సహాయాన్ని అందిస్తామని ఫౌండేషన్ కమిటీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్వా చిన్నబాబు, పంతం సత్యనారాయణ, జ్యోతుల సత్యమూర్తి, కోనేటి వెంకటేశ్వరరావు, జ్యోతుల వీరభద్రరావు, ఫౌండేషన్ కమిటీ గద్దె మారుతి, పుర్రె సూరన్న, ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.