వి.ఆర్.పురం:మండలంలోని రామవరం పంచాయతీ పరిధిలో ని చొప్పెల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన సేవాగుణానికి ఆకర్షితులై 30 కుటుంబాలు వారు ఆదివారం జనసేన పార్టీలోకి చేరారు. కారం నాగేంద్రబాబు, నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాల శ్రేయస్సు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని, సీట్లు ఆశించి పార్టీకి విరాళంగా అందజేసిన వందల కోట్ల రూపాయల నగదును తునప్రాయంగా వదిలేసి, ఎన్నికల ఖర్చు కోసం సొంత ఆస్తులు అమ్ముకుంటున్న నీతిమంతుడైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని, ఆయన వ్యూహం జనసైనికుల భవిష్యత్తుకి ప్రణాళిక అని గుర్తుచేశారు. ఆయన మార్గాన్ని ఎన్నుకున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. పార్టీలో చేరిన జనశైనికులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి కోసం,పార్టీ కోసం, పంచాయతీలోని సమస్యల పరిష్కారంకోసం మా వంతు కృషి చేస్తామని ముందు ముందు ఇంకా చేరికలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కెచ్చల పోసిరెడ్డి,బాగుల ఆంజనరావు, పరంకుశం మణికంఠ, సున్నం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పూసం సత్తిబాబు, చోడే గంగాధర్, కట్టం ధర్మరాజు, ముత్యాల గిరి, యం.రవి, కారం వెంకటేష్, వెంకట ప్రసాద్, జంగాల ప్రేమ్ సాగర్, కారం దేశయ్య, జల్లి చంటి, కారం నవీన్, ఉర్మ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
