Thursday, November 13, 2025

Creating liberating content

తాజా వార్తలుజీవితంలో కల్తీ లేని వస్తువులు పూలు...చివరికి మల్లెపూలు కూడా కల్తీయే

జీవితంలో కల్తీ లేని వస్తువులు పూలు…చివరికి మల్లెపూలు కూడా కల్తీయే

పులివెందుల
మానవుని జీవితంలో కల్తీ లేకుండా దొరికే వస్తువు ఒకటే అనుకుంటే ఇప్పుడు చివరకు పూలు కూడా కల్తీమయం అవుతున్నాయి. మల్లెపూలు అంటే ఓ ప్రత్యేకత ఉంది. వేసవి కాలంలో ఎక్కువగా దొరికే పూలు మల్లెపూలు ఈ పూలు పిల్లలకు జడలు కుట్టించేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతా రు. పావు 20 రూపాయలు వెచ్చించి పూలు కొను గోలు చేసి పిల్లలకు జడకు అలంకరిస్తారు. అలంక రించిన జడను చూసి తల్లిదండ్రులు మురిసిపోతా రు. ఫోటో స్టూడియో కు తీసుకువెళ్లి పిల్లలకు జడ ఫోటో తీయించి వాటిని ప్రేమ్ కట్టించుకొని ఆల్బమ్ లలో పెట్టుకుంటారు. అలాంటి మల్లె పూలు ఇప్పు డు కల్తీమయం అవుతున్నాయి. అయితే ఇప్పుడు మహిళలు జడలో పెట్టుకునే మల్లె పువ్వులు కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమా దంలో పడేస్తున్నారు వ్యాపారస్తులు. వేసవికాలం లో మల్లెపువ్వులు విరివిగా అందుబాటులో ఉంటా యి. దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్లకు, వెళ్లేటప్పుడుకొనుగోలు చేసి మరీజడలోపెట్టుకుంటుంటారు. అంతేకాకుం డా బంధువుల ఇండ్లకు వెళ్లేటప్పుడు పూలు పండ్లు తీసుకుపోవడం సాంప్రదాయంఅయితే మల్లెపువ్వు లను’కాపర్ సల్ఫేట్’లో ముంచి వ్యాపారస్తులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఈ కాపర్ సల్ఫేట్ లో పూలను ముంచితే తెల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తాయని అందుకే పూలను వాటిలో ముంచ డం వ్యాపారులకు అలవాటుగా మారింది . ఇలా పూలను కాపర్ సల్ఫేట్లో ముంచిన పూలనుచూస్తుం టే ఇలాంటి పూలను వాడితే ఏవైనా రోగాలు వస్తా యేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నా రు. ఈ పూలను కాపర్ సల్ఫేట్ నీటిలో ముంచడం వలన పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాపర్ సల్ఫేట్ ముంచిన పూలుచర్మ పై పడితే వాటిలోని రసాయనాలు శరీరంలోకి వెళ్లిక్యాన్సర్ వచ్చే అవ కాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి నెలకొనిం దని ప్రజలంటున్నారు. రసాయనాలు కలిపి అరటి పండ్లు, మామిడి పండ్లు, కలర్ వచ్చి తాజాగా ఉండేందుకు ఈ రసాయనాలు వాడుతున్నారు. కానీ ఇప్పుడు చివరకు పూలను కూడా వదలకుం డా వీటికి రసాయనాలు అద్దుతున్నారు. రసాయ నాలు కలిపే వ్యాపారస్తులపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article