Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుఆగస్టు 18 న జన విజ్ఞాన వేదిక వార్షిక జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

ఆగస్టు 18 న జన విజ్ఞాన వేదిక వార్షిక జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

మార్కాపురం :మార్కాపురంలోని శ్రీవిద్య కోచింగ్ సెంటర్ నందు జన విజ్ఞాన వేదిక పట్టణ కమిటీ సమావేశం పట్టణ గౌరవాధ్యక్షులు చక్కిలం శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.జన విజ్ఞాన వేదిక జిల్లా ఆరోగ్య కన్వీనర్ డాక్టర్ బి.శరత్ మాట్లాడుతూ ఆగస్టు 18 న మార్కాపురంలో జరగనున్న జిల్లా వార్షిక మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. జన విజ్ఞాన వేదిక మండల కార్యదర్శి కే ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఉపాధ్యాయులందరూమహాసభలకు హాజరు కావాలన్నారు. జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు కే సుధాకర్ మాట్లాడుతూ మహాసభల సందర్భంగా మ్యాజిక్ షో , సైన్స్ ప్రదర్శనలు ఉంటాయన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ మహాసభలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులు,అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక పట్టణ యూత్ నాయకులు జె శేఖర్, మర్రిపూడి రామకృష్ణ హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article