32 సొసైటీలకు జనసేనకు ఏడు సొసైటీలేనా?
అంతర్ మదనంలో నియోజకవర్గ జనసేన శ్రేణులు
టిడిపిలో పైరవీలు చేస్తున్న నేతలు.. అసంతృప్తితో జన సైనికులు
అమలాపురంలో 24 సొసైటీలకు 10 జనసేనకు కేటాయింపు?
రామచంద్రపురంలో కొలిక్కి రాని త్రిమెన్ కమిటీలు
14 జనసేన ఎంపీటీసీలు ఉన్న నియోజకవర్గానికి ఇదేం దుస్థితి
రాష్ట్రంలోనే జనసేనకు మంచి గుర్తింపు ఉన్న నియోజకవర్గం పరిస్థితి ఇదేనా?
గ్రామ స్థాయిలో సిద్ధం చేసిన జాబితాలో మార్పులకు ప్రయత్నాలు
ఆరేళ్లుగా పీఏసీఎస్ లకు ఎన్నికలు లేకపోవడంతో పెరుగుతున్న ఆశావాహులు

రామచంద్రపురం
తాజాగా ప్రభుత్వం సొసైటీలకు త్రిమెన్ కమిటీలు నిర్వహిస్తున్నారన్నప్రచారంతో రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య సాయోధ్య కుదరక ఇంకా కొలిక్కి రాసినట్లు సమాచారం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీకి నాడు వైసిపి ప్రభుత్వాన్ని ఎదురోడ్డి పద్నాలుగు ఎంపీటీసీలతోపాటు పలు సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్న ఘనత ఉంది. ఆవిషయంలో రాష్ట్ర స్థాయిలోనే జనసేన పార్టీ ఇక్కడ ప్రదమ స్థానంలో నిలిచింది. అలాంటి పరిస్థితి ఉన్న జనసేనకి ఇప్పుడు ఇక్కడ సొసైటీల పంపకంలో అందని ద్రాక్ష గానే ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో 32 సొసైటీలు ఉండగా జనసేనకు ఏడు సొసైటీలు కట్టబెట్టి మిగతా తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించడంతో జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నారు. పైగా టిడిపి నేతలు పలువురు ఈవిషయంలో ఆదినాయకత్వం నుండి సిఫార్సులతో పైరవీలు చేస్తున్నారని సమాచారం. దీంతో జనసేన శ్రేణులు మరింత అసహనాన్ని గురవుతున్నారు. అమలాపురంలో 24 సోసైటీలుకు గాను జనసేన పార్టీకి 10 సొసైటీలు ఇస్తున్నట్లు సమాచారం .పక్క నియోజకవర్గానికి అలా ఇచ్చిన తమకు ఇలా చేయటం ఏంటని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోన జనసేన పార్టీకి రామచంద్రపురం నియోజవర్గం మంచి పట్టు ఉంది. అలాగే గుర్తింపు ఉంది. ఆగుర్తింపుకు ఈరోజు ఇక్కడ ఏ విధమైన ఫలితం లేకుండా పోతుందని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల కమిటీలను (త్రిమెన్)ప్రభుత్వం నియమించ నున్న తాజా పరిస్థితిలో ఆపదవులు ఆశించే వారి సంఖ్య బారీగానేఉంది . ఇప్పటికే కూటమి నాయకులు ఆయా సొసైటీల పరిధిలో అర్హుల జాబితాలను సేకరిస్తుండటంతో త్రిమెన్ కమిటీలను నియమించే పనిలో నిమగ్నమై ఉన్నారు.ఇప్పటికే పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవడం కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సొసైటీల పంపకాలక చర్చలు ఊపందుకున్నా సఖ్యత మాత్రం నేటికీ కుదరక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.మరో పక్క ప్రభుత్వం సొసైటీల పర్సన్ ఇన్ ఛార్జిలను మరో ఆరు నెలలు కొనసాగిస్తూ గత నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలు నియమిస్తే ఈ ఉత్తర్వులు రద్దు అవడం ఖాయం . వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2018 నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి అధికారులు ఇచ్చింది. కమిటీలో చైర్మన్, ఇద్దరు సభ్యులు వున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ అయిదు సంవత్సరాలు అప్పట్లో గడిపేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్సన్ ఇన్ ఛార్జిలకు అధికారులు ఇచ్చింది. గత నెల 21తో వారి గడువు పూర్తి కావడంతో మరో ఆరు నెలలు వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.. ఇదిలా వుండగా సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ఏక పక్ష విజయాలతో ఊపు మీద వున్న కూటమి ప్రభుత్వం అదే విధంగా సొసైటీలకూ ఎన్నికలు నిర్వహిస్తుందని అంతా భావించారు. నీటి సంఘాల ఎన్నికలను లైట్ గా తీసుకున్న వైకాపా సొసైటీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించాయి. కాని ఈలోగా గత ప్రభుత్వం తరహాలోనే సొసైటీలకు త్రిమెన్ కమిటీలను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు కార్యకర్తల స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి నేతలు సొసైటీలకు పంపకాలు ప్రక్రియ మొదలెట్టారు.కానివారిమద్య సఖ్యత కుదరక ఇంకా కొలిక్కి రాలేదు దీనికి అనుగుణంగా ఆయా సొసైటీల పరిధిలో ఆరులైన కార్యకర్తలు, నాయకుల జాబితాలను ఆటు తెలుగుదేశం, ఇటు జనసేన నాయకులు మల్ల గుల్లలు పడుతున్నారు. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా సర్కారు పట్టించుకున్నట్టు లేదు. సొసైటీ కమిటీలో పదవి ఆశించేవారి నుంచి వారి అర్థతలు, వారికి పీఏసీఎస్ లో సభ్యత్వం వుందా. వారికి సొసైటీలో రుణం వుందా. రుణం ఎగవేత వుందా, వంటి వివరాలు సేకరిస్తున్నారు. సొసైటీ నిబంధన ప్రకారం రిజర్వేషన్లు లేకున్నా సామాజిక న్యాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాని ఇప్పటికే సొసైటీలకు అధ్యక్ష పదవికి ఆశించిన వారిలో కొందరికి అర్హత లేకపోవడంతో దిక్కు దిక్కులు చూస్తూ మరో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలో ఆయా ఇన్ ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని జాబితాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలు తమ వాటాల కోసం ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.ఇదిలా వుండగా ఇప్పటి వరకూ త్రిమెన్ కమిటీల పాలనలో వున్న కొన్ని సొసైటీల్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పార్టీల బ్యానర్ పై నియమించబడుతున్న కమిటీలు రైతులను పట్టించుకోక క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నట్లూ ఆరోపణలు వున్నాయి. సొసైటీల బకాయిల వసూళ్లలోనూ చాలా సొసైటీలు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టే వున్నాయని సమాచారం. ఏదిఏమైన రామచంద్రపురం నియోజవర్గంలో మాత్రం జనసేన పార్టీకి 7 సొసైటీలు కేటాయించడంపట్ల జనసేన పార్టీలో నేతలకు, శ్రేణులకు సైతం రుచించడంలేదు. ఇప్పటికైనా జనసేనకు మరిన్ని సొసైటీలు కేటాయించాలని పత్రిక ముఖంగా పలువురు కోరుతున్నారు.
…