ఏలూరు:
గ్రామ సచివాలయాల్లో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాలోని పేర్లను టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పరిశీలించారు.ఈ మేరకు సోమవారం3 డివిజన్ గ్రామ సచివాలయంలో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాను పరీశీలించి సదరు విఆర్వోల నుండి వివరాలను అడిగి తెలుసుకుని షెడ్యూల్డ్ కులాల జాబితాలో లోపాలను గుర్తిస్తే ఆ లోపాలను సదరు వ్యక్తికి తెలియచేసి లోపాలను సవరించాలని విర్వోలతో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలందరూ గ్రామ సచివాలయాల్లో వారి పేర్ల జాబితా సక్రమంగా వుందో లేదో మంగళవారం లోపు పరిశీలించుకుని లోపాలు ఉంటే విఆర్వో ల ద్వారా లోపాలను సవరించుకోవాలని ఈ సందర్భంగా జాలా బాలాజీ తెలియచేసారు.