అమరావతి:సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. ఆంధ్ర పరిస్థితిని… కాదు కాదు… రాష్ట్ర దుస్థితిని నేషనల్ ఛానల్స్ లో దేశ వ్యాప్తంగా దండోరా వేసేలా జగన్ రెడ్డి చేశారని దుయ్యబట్టారు. అప్పులతో ఏపీ మరో శ్రీలంక అవుతుందని గతంలో పవన్ కల్యాణ్ హెచ్చరిస్తే వైచీపీ ప్రబుద్ధులు హేళన చేశారని అన్నారు. అభివృద్ధి లేకుండా అప్పులు మాత్రమే తెచ్చి బటన్ లు నొక్కడం ద్వారా ఆంధ్ర పరువును ఈరోజు జాతీయంగా, రేపు అంతర్జాతీయంగా కూడా తీయగల సమర్థులు జగన్ అని దుయ్యబట్టారు. 151 సీట్లు ఇచ్చినందుకు ఏపీని ఆదర్శంగా తీసుకునేలా పాలిస్తారనుకుంటే… అవహేళన చేసేలా పాలించారని విమర్శించారు.