విశాఖ:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. చినముషిడివాడలో గల విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానం దేంద్ర సరస్వతి స్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైసీపీకి చెందిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్.. ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజశ్యామల యాగం పూర్ణాహూతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారు, వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు గంట పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జగన్ భాగస్వా మ్యులు అయ్యారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను జగన్‌కు అందజేశారు.