ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్
చింతూరు
ప్రపంచ శాంతి స్థాపన, క్రమశిక్షణతో కూడిన జీవన మార్గమే ఇస్లాం ప్రధమ కర్తవ్యం అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం కాకినాడ జిల్లా, గోకవరం మండలం, గోపాలపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన హంజా మసీదును చింతూరు కు చెందిన డాక్టర్ జమాల్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జమాల్ ఖాన్ ముస్లిం యువతనుద్దేషించి మాట్లాడారు. ముస్లిం సహోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఐదు పూటల నమాజు చేయాలన్నారు. తద్వారా క్రమశిక్షణతో మెలగాలని, నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ముస్లిం లా ప్రకారమే అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరితో కలిసి మెలిసి, సోదర భావంతో మెలగాలని, అదే ప్రపంచ శాంతికి దోహదపడుతుందన్నారు. అల్లాను నిత్యం దువా చేయాలని, ఆకలి దప్పులతో అలమటించే అనార్థులను ఆదుకోవాలన్నారు. కష్టకాలంలో ఉన్న వారికి సహాయ, సహకారాలు అందించతమే ఖురాన్ చూపిన రుజు మార్గం అన్నారు. మసీదు నిర్మాణానికి చేయుతనందించిన ముస్లిం ట్రస్ట్, ఎమీరేట్స్ వారికి, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలు అందించిన వారందరికి జమాల్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.
మీ సేవలు అంతటా విస్తరించాలి – ముస్లిం పెద్దల దీవెనలు………
ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ మూడు రాష్ట్రాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించటంతోపాటు, కష్టాల్లో ఉన్న అభాగ్యులకు నేనున్నానని ఆపన్న హస్తం అందిస్తున్న, మీ సేవలు అంతటా విస్తరించాలని ముస్లిం పెద్దలు డాక్టర్ జమాల్ ఖాన్ ను దీవించారు. మసీదు ప్రారంభోత్సవం అనంతరం హంస మసీదు కమిటీ పెద్దలు డాక్టర్ జమాల్ ఖాన్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అహ్మద్ మౌలానా, మసీదు నిర్మాణానికి ముఖపాత్ర వహించిన రాజోలు వాసి జిలాని,సుభాని గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

