కనిగిరి
కీర్తిశేషులు పెద్దాయన కనిగిరి మాజీ శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు 7వ వర్ధంతి సందర్భంగా కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జన హృదయ నేతగా వామపక్ష అభిమానిగా ఆరంభమైన రాజకీయ ప్రస్థానం ఏ పార్టీలో ఉన్నా ఇరిగినేని పై నేటికి ప్రజాభిమానం సుస్థిర స్థానం కల్మషం లేని ఇరిగినేనీ మాట కసి (తనం) కన్పించ నీరాజకీయ బాట
మీ పలకరింపులో కన్పించే ఆత్మీయతా అభిమానం
మిమ్ను నమ్ముకున్న వారికోసం ఎందాకైనా వెళ్లే మీ పోరాట పటిమ నా అనుకున్నవారి కోసం మీరు పడిన ఆరాటం,మీరు సాగించిన సాదా సీదా జీవన రాజకీయం
మిమ్మల్ని నమ్ముకున్న వారి చెయ్యి వదలని మీ నైజం
మూడు దశాబ్దలుగా మిమ్మిల్ని రాజకీయం లో నిలిపిందనేది నిజం. అందుకే నేటికి మిమ్మల్ని మరువ లేకున్నారు. కనిగిరి జనం ఇది ముమ్మాటికి నిజం నిజం
నేటికీ మీ అభిమాన గణం చేస్తోంది నిత్య మీ నామ స్మరణం అంటూ ఇరిగినేని కి, దారపనేని
ఘనమైన నివాళులు అర్పించారు.