పులివెందుల టౌన్
పులివెందుల వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్యసేవలు వాటి అమలులో జరుగుతున్న జాప్యం, లోపాల పరిశీలనలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా. శశిభూషణ్ రెడ్డి , జిల్లా గణాంకాధికారి రమేష్ రెడ్డి జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి నారాయణ , ఉప గణాంకాధికారి హరినాథ్, మేనేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అధికారి రాజశేఖర్ తో జిల్లాటాస్క్ పోర్స్ బృందం సభ్యులు శుక్రవారం పట్టణప్రాధమిక ఆరోగ్య కేంద్రం, నగరిగుట్ట పరిధిలోని శ్రీరామ టెంపుల్ ఆయస్మాన్ ఆరోగ్య మందిర్ (గ్రామ ఆరోగ్యకేంద్రం ) ను సందర్శించి విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో శ్రీరామ టెంపుల్ గ్రామ ఆరోగ్యశాల ద్వారా అందుతున్న ఆరోగ్య సేవలపట్ల సంతృప్తిని వ్యక్తపరచి సదరు సిబ్బందిని ముందుండి నడిపిస్తున్న వైద్యాధికారులు డా .శాంతి కుమార్, డా. ప్రత్యూషను అభినందించారు. అంతకు ముందు పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆరోగ్య పర్యవేక్షకులు, సామాజిక ఆరోగ్య అధికారులు, బహుళార్థసాధక ఆరోగ్య సహాయకులు, ఏ. ఎన్. ఎమ్. లు చంద్ర కళావతి, ఇందిరా దేవి , ఆశా వర్కర్లతో సమావేశం ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్యసేవలు వాటి అమలులో జరుగుతున్నజాప్యం , లోపాల నివారణ తదితర విషయాలపై సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు బాగున్నవారిని అభినందించడమేకాక పనితీరు సరిగాలేని వారిపట్ల త్రీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని హెచ్చరించారు . ప్రజలు కూడా తమ ఆరోగ్యం పట్ల అవగాహన మెరుగు పరుచుకోవాలని తక్కువ ఖరీదు కలిగి స్థానికంగా లభించే సమీకృత ఆహారాన్ని తీసుకోవడం ద్వారానూ, వ్యాయామము ద్వారానూ , దురలవాట్లకు దూరంగా వుండటం ద్వారానూ, వత్తిడిలేని జీవన విధానం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని వారు తెలియ చేసారు.