Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుశోకసంద్రంలో ఎల్లుట్ల

శోకసంద్రంలో ఎల్లుట్ల

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆలూరు సాంబశివారెడ్డి..

మృతులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం.
గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అనంతపురం వైఎస్సార్సీపీ నేత ఆలూరు సాంబ శివారెడ్డి.
పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన ఈ 8 మందికి సాంబ శివారెడ్డి, శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, ఎంపిపి రాఘవరెడ్డి, జడ్పీటీసీ గోపాల్ రెడ్డి నివాళులర్పించారు.
మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు. తక్షణ సహాయం కొరకు ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.10 వేలు అందజేశారు.
ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా బాధాకరమని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం మరింత ఆదుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article