జీలుగుమిల్లి
శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు మండలంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ గ్రామాన షష్టి పురస్కరించుకొని పుట్లో పాలు పోసుకోవడానికి ఎక్కడికి అక్కడ బారులు తీరారు. ములకలపల్లి గ్రామంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి షష్టి అనంతరం కళ్యాణం నిర్వహింప చేశారు. ఇక్కడ షష్టి ఉత్సవాలు ముస్లింలు హిందువులు సంయుక్తంగా నిర్వహించడం ఆనువాయితి. 50 సంవత్సరాల క్రితం ముస్లింలు లకు కలలో స్వప్నంగా స్వామి వారి దర్శించి గుడిని ఏర్పాటు గుడిని ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో తక్షణం తన ఇంటి వద్ద గుడి నిర్మాణం చేపట్టి పూజ కార్యక్రమాలు పూర్వం నుండి నిరంత చేశారు . మసీదు కానుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండటం విశేషం. వారం రోజులు పడి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు సంయుక్తంగా నిర్వహించడం విశేషం. పలు గ్రామాలలో షష్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర షష్టి శుభ సందర్భంగా దర్భగూడెం గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాత్రి స్వామివారి కళ్యాణం మరియు ఉదయం విశేష పూజలు అభిషేకాలు తదితర కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త రేపాక గంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.