Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం.. గవర్నర్‌ నజీర్‌ ప్రసంగం..

ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం.. గవర్నర్‌ నజీర్‌ ప్రసంగం..

ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిచారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సందర్భంగా వైసిపి సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.అంతకు ముందు గవర్నర్‌ మాట్లాడుతూ.. ”విభజనతో రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ మిగిలింది. దీంతో రాష్ట్రం ఒడిదుడుకులకు లోనైంది. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ప్రతీకార రాజకీయాలు చేసింది. విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడలేదు. 2019లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో అధికారం మారింది. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులపై మూల ధన వ్యయం 56 శాతానికి పడిపోయింది.” అని గవర్నర్‌ నజీర్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article