Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుచెరువులో అక్రమ భవనం – బాంబులతో కూల్చేసిన అధికారులు

చెరువులో అక్రమ భవనం – బాంబులతో కూల్చేసిన అధికారులు

చెరువులో అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లో కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి 12 సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. నీళ్లలో అడుగుపెట్టకుండా లోనికి వెళ్లడానికి కొంత దూరం నుంచే మెట్లు కట్టారు. యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేదతీరుతూ ఉండేవారు. ఈ అక్రమ భవనాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు బాంబులతో ఆ కట్టడాన్ని కూల్చివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article