అమరావతి : పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏడు ఘటనపై అన్ని వీడియోలు బయటపెట్టాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో లీక్ అవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒక్కటే లీకైందా? అని ప్రశ్నించారు. ఆ వీడియో సరైనదేనా? కాదా అని కూడా చూడకుండా ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోందని.. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని వీడియోలు బయటపెట్టాలని.. అప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందని ఆయన డిమాండ్ చేశారు.

