Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుకూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఎమ్మెల్యేల క్యాంపెయిన్

కూటమి పాలనకు 100 రోజులు.. ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఎమ్మెల్యేల క్యాంపెయిన్

కూటమి పాలనకు నేటితో 100 రోజులు పూర్తవడంతో 26వ తేదీ వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేయనున్నారు. పెన్షన్ల పెంపు, మెగా DSC, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరానికి నిధులు, ‘ల్యాండ్ టైటిలింగ్’ రద్దు తదితర 100 కార్యక్రమాలు చేశామని చెపుతూ నేతలంతా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల ప్రభుత్వ సిబ్బంది తమ పరిధిలో ఇంటింటికీ వెళ్లి.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ నియోజకవర్గాల్లో ఈ ఏడు రోజులూ రోజుకో గ్రామం సందర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. వారికి ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపిక చేసిన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలన గురించి వివరించాలి. తర్వాత ఆ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి జనం నుంచి వినతులు స్వీకరించాలి. వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొదటి రోజు శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article