వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, మరియు మాధురి ల విషయంలో జరుగుతున్న వివాదం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో మాధురి, ట్రోల్స్‌కి గురై మనస్థాపంతో, తన కారును మరో కారుతో గుద్ది ఆత్మహత్యకు యత్నించిన సంగతి విధితమే. అయితే, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ నేపథ్యంలో, అమెరికాలో ఉంటున్న మాధురి భర్త మహేష్ చంద్రబోస్ ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, కానీ మాధురి వైసీపీలోకి వెళ్లాలని ఇష్టపడటం వలననే తాను మద్దతు తెలిపాను” అన్నారు.”నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె రాజకీయంగా ఎదుగుతుందనే కారణంతోనే కొందరు ఈ ఆరోపణలు చేస్తున్నారు,” అని మహేష్ తన భార్య మాధురికి మద్దతు తెలిపారు.మరోవైపు, మాధురి కూడా మీడియాతో మాట్లాడుతూ, “వాణి రాజకీయ కోణంలోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను” అని చెప్పారు.

