పులివెందుల
పులివెందుల పట్టణంలోని బాకరాపురం నరసారెడ్డి పెట్రోల్ బంక్ సమీపంలో కొన్ని ప్రాంతాలలో ఆదివా రం రాత్రి విద్యుత్ ఐ వోల్టేజ్ రావడంతో గృహోపక రణాలు దగ్ధమయ్యాయి అర్ధరాత్రి ఒక్కసారిగా హైవోల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్ బల్పులుపేలిపోయాయి.ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్ లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి గత కొద్ది రోజుల నుంచి కరెంటు ఎప్పుడు పోతుందో ? వస్తుందో? అర్థం కాని పరిస్థి తి నెలకొందని అర్ధరాత్రి ఉన్నట్టుండి అధిక ఓల్టేజ్ రావడంతో భయభ్రాంతులకు గురయ్యామన్నారు. గృహోపకరణాలు కాలిపోవడంతో ఆర్థికంగా నష్ట పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.