Monday, March 30, 2026

Creating liberating content

సినిమామెట్రోలో డాన్స్ చేసిన స్టార్ హీరోయిన్

మెట్రోలో డాన్స్ చేసిన స్టార్ హీరోయిన్

ఈ మధ్య స్టార్స్ పబ్లిక్ లోకి వచ్చేస్తున్నారు. అది కూడా విపరీతంగా క్రౌడ్ ఉండే ప్రదేశాల్లో తమ సినిమాలను వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. షాపింగ్ మాల్స్, కాలేజీలు, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ లో సందడి చేస్తున్నారు.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏకంగా మెట్రో ట్రైన్ లో డాన్స్ చేసింది. ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి. ఆమె లేటెస్ట్ మూవీ మడ్గావ్ ఎక్స్ ప్రెస్. ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మడ్గావ్ ఎక్స్ ప్రెస్ చిత్ర యూనిట్ తో పాటు ముంబై మెట్రో లో నోరా ఫతేహి సందడి చేసింది. ట్రైన్ లో ఓ సాంగ్ కి డాన్స్ చేసింది.నోరా ఫతేహితో పాటు పలువురు డాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మడ్గావ్ ఎక్స్ ప్రెస్ చిత్రంలో దివ్యేందు శర్మ, ప్రతీక్ గాంధీ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని దర్శకుడు కునాల్ కేము తెరకెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article