జీలుగుమిల్లి
ఏజెన్సీలో గత రెండు మాసాల నుండి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగుపూరుతున్నాయి వీటికి ఏమి తీసుకొని విధంగా గత రెండు రోజుల నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రయాణం చేసేటప్పుడు వాగులు దాటేటప్పుడు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. పెద్ద వాగులు దగ్గర కలవట్ల దగ్గర పొంగు పొరలతో ఉంటే ఆ ప్రాంతాలలోని పోలీసులు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే ప్రయాణాన్ని రెండు రోజులు పొడిగించుకోవాలని ప్రాణాల మీదకి తీసుకోవద్దని ఆయన కోరారు. వివిధ ప్రాంతాలలోని వాగులను ఆయన పరిశీలన చేశారు. ఆయా ప్రాంతాలలోని రెవెన్యూ అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయా గ్రామాలలో చెరువులు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని రెవిన్యూ అధికారులను కోరారు. అనుమానం ఉన్న ప్రాంతాలలో ఇసుక బస్తాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఏమాత్రం అవసరం అయినా తనను సంప్రదించాలని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అధికారులకు సూచించారు. వానలలో, వాగులు పొంగుతూ ఉంటే సాక్షాత్తు శాసనసభ్యులు గ్రామాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు హర్షత్ రేఖలు వ్యక్తం చేస్తున్నారు.

