** పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.
** కల్వర్టులు, సప్ట్టాలు పైనుంచి పొంగి పొర్లుతున్న వరద ఉధృతి.
** సంభించిన జనజీవనం
** వందలాది ఎకరాల వరి పంట నీటమునక
** ప్రమాదకర స్థాయిలో పొంగుతున్న అన్నవరం వాగును దాటుతున్న ప్రజలు.

వి.ఆర్.పురం :బుధవారం తెల్లవారుజామున గాలి వానతో అతి భారీ వర్షం కురిసింది, మండలంతో పాటు మండలానికి ఎగువ ప్రాంతాల్లోను, కొండల గుట్టల్లోను ఎడతెరిపిలేని భారీ వర్షం కురిసింది. కురిసిన ఈ భారీ వర్షం ప్రభావం వల్ల వాగులు వంకలు పొంగి ఉధృతంగా ప్రవచిస్తున్నాయి, పలుచోట్ల రోడ్లపై వరద నీరు అతి భారీగా ప్రమాదకరస్థాయిలో ప్రార్థిస్తున్నాయి. మండలంలోని తుష్టివారి గూడెం అడవి వెంకన్న గూడెం గ్రామాల మధ్య వాగు ఉదృతంగా చపట్టా పైనుంచి ప్రవహించింది, అదేవిధంగా అన్నవరం ఉమ్మడివరం గ్రామాల మధ్య వాగు ఉగ్రరూపం దాల్చి కల్వర్టు పై నుంచి పొంగి చాల ఉదృతంగా ప్రవహించింది, అలాగే అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మొద్దుల గూడెం గ్రామం వద్ద చెరువు లోకి నీరు చేరుకొని, చెరువు కూడా నిండి పోయి పొంగిపోవటం వల్ల, వరద నీరు మోద్దుల గూడెం, సీతం పేట గ్రామాల మధ్య గల చపట్టా పైనుంచి అతి భారీగా వరద నిరు ప్రవహించింది. అదేవిధంగా మండలంలోని తెల్లవారి గూడెం, కుంజవారి గూడెం తదితర గ్రామాల వద్ద కురిసిన భారీ వర్షానికి ఉదృతంగా వాగులు పొంగి రోడ్ల పైనుంచి ప్రవహించాయి. బీభత్సాన్ని సృష్టించిన అతి భారీ వర్షం ప్రభావం వల్ల చాలా చోట్ల రోడ్లు పైనుంచి, కల్వర్టుల పైనుంచి ఉదృతంగా ప్రవహించటం వల్ల ప్రజల రాక పోకలకు ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా పడిన ఈ కుంభ వర్షానికి జనజీవనం స్తంబించటమే కాకుండా, వందలాది ఎకరాల వరి పంట వర్షపు నీటిలో మునిగి పోయి, పంటలు దెబ్బతిన్నాయి, దీంతో రైతన్నల నడ్డి విరిగి నట్టయింది. మొత్తం మీద అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం సృష్టించిన బీభత్సంతో మండల ప్రజలు నానా అవస్థలు పడుతూ, అన్నవరం వాగు వద్ద ఉదృతంగా కల్వర్టు పై నుంచి ప్రవహిస్తున్న ప్రమాదకర వాగును, అత్యవసర పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా వరద నీటిని దాటుతున్నారు.


