చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి పరిసర ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా గార్గేయ నది ఉధృతంగా ప్రవహించడంతో మూడు చోట్ల తాత్కాలిక రాకపోకలు సాగించే కల్వట్లు వర్షం ధాటికి కొట్టుకుపోవడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోనమంద చిన్నకంపల్లి రెడ్డివారిపల్లి పోలికిమాకులపల్లి చింతతోపు పేటూరు బసవ పల్లి గ్రామాల వారు పెద్ద ఉప్పరపల్లికి ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్న వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లాల్సిన దాదాపు 7 గ్రామాలలోని 200 మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. ప్రతి శుక్రవారం పెద్ద ఉప్పరపల్లిలో జరిగే వారపు సంతకు రావాలంటే కూడా ఈ గ్రామాల ప్రజలు రాలేని పరిస్థితి నిత్యవసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది.