
అటు గాయకుడు తన గానామృతాన్ని ఎంతో గంభీరం గా వినిపించే డిప్యూటీ కలెక్టర్ ఆశయ్యను సత్కరించారు మురుగా చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఒమ్మి సంతోష్ నాయుడు.తన సోదరుడు గాయకుడు ,సిని డైరెక్టర్ నిర్మాత అయిన ఒమ్మి రమా శంకర్ జ్ఞాపకార్థం ప్రతినెల 27వతేది మురుగా చారిటబుల్ ట్రస్ట్ తరుపున పాటల ప్రోగ్రాం ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ అధినేత సంతోష్ నాయుడు శుక్రవారం బెజవాడ హనుమంతరాయ గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన సంగీత విభారిలో డిప్యూటీ కలెక్టర్ ఆశయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బెజవాడ కళా సంస్థల అధినేతలు, గాయని గాయకులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


