Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలురేవంత్ రెడ్డి చరిత్రలో ఉద్యమద్రోహిగానే మిగిలిపోతాడు: హరీశ్ రావు

రేవంత్ రెడ్డి చరిత్రలో ఉద్యమద్రోహిగానే మిగిలిపోతాడు: హరీశ్ రావు

ఉద్యమకారుల పైకి తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని… కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావొచ్చు… కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు మాత్రం కాలేడన్నారు. ఉద్యమకారులు అన్న ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ… ప్రజల ఆకాంక్ష కోసమే తాము స్వరాష్ట్ర పోరాటం చేశామన్నారు.ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు లేకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దశాబ్దాల కలను సాకారం చేయడం కోసం పని చేశామన్నారు. సిద్దిపేటలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులే అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరినీ సన్మానించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా ‘జై తెలంగాణ’ అని లేదని తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనల్లో జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని కచ్చితంగా ఉండేదని గుర్తు చేశారు.ఆ రోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని… ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పదం మాయమైందని మండిపడ్డారు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article