Saturday, February 21, 2026

Creating liberating content

తాజా వార్తలుసిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు లేక నీళ్లు అడుగంటుతున్నాయి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ...

సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు లేక నీళ్లు అడుగంటుతున్నాయి.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని అందులో విమర్శించారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లో నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ఏడాది ఇదే నెలలో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందన్నారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా తక్కువ నీరు ఉందన్నారు. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. వారిలో పంట వేయాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొందన్నారు. మిడ్ మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని హరీశ్ రావు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article