పులివెందుల టౌన్ :శ్రీరాముడి దూత చిరంజీవుడు హనుమాన్ జన్మదినోత్సవ సందర్భంగా జూన్ 1న తృతీయ హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన గోడపత్రాలను సింహాద్రిపురం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సింహాద్రిపురం మండల హిందూ ఐక్యవేదిక నాయకులు ఆవిష్కరించారు అనంతరం హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ జూన్ 1 సాయంత్రం 4 గంటలకు నూతన బస్టాండ్ పక్కన కల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి పూల అంగళ్ల మీదుగా పాత బస్టాండ్ వరకు శ్రీ హనుమాన్ శోభయాత్రను హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మీడియా ఇన్ఛార్జ్ యాగంటి బాలకృష్ణారెడ్డి హిందూ ఐక్యవేదిక నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రావులకొల్లు శేఖర్ రెడ్డి కాన్వెంట్ శ్రీనివాస్ రెడ్డి కృష్ణయ్య గోపి నాయుడు మల్లయ్య తదిరులు పాల్గొన్నారు.