Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుమంత్రి పదవికి, వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

మంత్రి పదవికి, వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

విజయవాడ : మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జయరాం ఈ విషయాన్ని ప్రకటించారు. వైసిపితోపాటు మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 22వ తేదీన మంగళగిరిలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జయహో బీసీ సభ’లో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్‌ ను గుమ్మనూరు జయరాం ఆశిస్తున్నారు. జయరాంకు ఈసారి ఆలూరు ఎమ్మెల్యే టికెట్‌ ను సిఎం జగన్‌ నిరాకరించారు. కర్నూలు ఎంపి టికెట్‌ ను ఆఫర్‌ చేశారు. అయితే ఈ ఆఫర్‌ ను జయరాం తిరస్కరించారు. రాంపురం బ్రదర్స్‌ వల్లే తనకు సీటు రాలేదని గుమ్మనూరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపిలో చేరడానికి సిద్ధమయ్యారు. నేడు హైదరాబాద్‌లో చంద్రబాబుతో గుమ్మనూరు జయరాం భేటీ కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article