ముదిగుబ్బ :ముదిగుబ్బలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు రూరల్ సీఐ శ్యాంరావు చేపట్టిన చర్యలపట్ల సిపిఐ, టిడిపి నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ముదిగుబ్బలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైందని ఐదు రోజుల క్రితం ఇన్చార్జి తీసుకున్న ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యాం రావు అనంతపూర్ – చెన్నై జాతీయరహదారి లోని ముదిగుబ్బలో , పుట్టపర్తి రోడ్డునందు, పులివెందులరోడ్డు నందు ట్రాఫిక్ క్రమాబద్ధీకరణకు చేపట్టిన చర్యలతో పాదచారులు, వాహనదారులు, దుకాణాదారులు మిక్కిలి సంతోషిస్తున్నారు. దీంతో మండల వ్యాప్తంగా సిఐని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈనేపథ్యంలో సిపిఐ టీడీపీ నాయకులు చల్లాసీనా, తుమ్మలచిన్నప్ప, తిప్పయ్య, రాధాకృష్ణ చల్లా రంగయ్య, ప్రసాద్ నాయక్, దాడితోట భాస్కర, సుధాకర్, లింగుట్ల వెంకటరాముడు, అమిలినేని రామాంజనేయులు పూలమాలలు, దృశ్యాలువాళ్లతో సత్కరించారు.