పరవాడలో పరువుపోతుంది..
ఆర్థిక రాజధాని లో ఇంత అన్యాయమా
పరవాడలో పడగవిప్పిన మట్టి మాఫీయా
అక్రమా రవాణా కు ఆజ్యం పోసిందేవరు
అభివృద్ధి పేరుతో అన్యాయమా మేల
అధికారం ఉంటే అంతా వారిష్టమేనా
ముడుపులు ముట్టితే అంతా మౌనమేనా
(ప్రజాభూమి ప్రతినిధుల బృందం టి కుమార్ ,పద్మ పరవాడ నుంచి…)
భారతదేశానికి స్వాతంత్య్ర ము వచ్చిన తరువాత ప్రజాస్వామ్యం, పార్లమెంటరి విధానాలు అధికార వ్యవస్థలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుతెచుకుంటారని ఆనాడే చక్రవర్తి రాజాగోపాలాచారి చెప్పిన విదంగా నేటి పాలకుల తీరు ను చూస్తే అర్థనవుతోంది దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒవైపు చెబుతూనే మరో వైపు ఆర్థిక నేరాల తో పాటు అక్రమ దందాలు కూడా పెట్రేగి పోతున్నాయి.

రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడానికి ముందుకు వచ్చామని చెబుతూ పరిపాలన సౌలభ్యం కోసం విశాఖ ను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన తరువాత కూడా మాఫీయా రాజ్యమేలుతుండటం చూస్తే ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా పరవాడ ,ముసలివాడ ప్రాంతాల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టి రాత్రి పగలు లేకుండా టిప్పర్ల తో మిషన్ ల సాయంతో యథేచ్ఛగా తరలిస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక అధికార పార్టీ నేత నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఈ అక్రమ దందాలో బాగసామ్యము అయినట్లు బహిరంగంగా అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇక సమాజంలో అవినీతి కుంపటిలో కూరుకు పోయిన అధికార వ్యవస్థలు కాసులకోసం కక్కుర్తి పడి అక్రమ దందాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదంతా ఆర్ధిక రాజధాని కూతవేటు దూరంలో జరుగుతోంది.అయిన దాన్ని అడ్డుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిర్యాదు చేస్తే నామా మాత్రపు తనిఖీలతో అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే ప్రజల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి మరి.