Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలుపోలింగ్ తర్వాత తొలిసారి టీడీపీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం

పోలింగ్ తర్వాత తొలిసారి టీడీపీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే 13న పోలింగ్ జరిగిన తర్వాత తొలిసారిగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అధినేత రాకతో టీడీపీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. సీఎం, సీఎం అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో టీడీపీ ఆఫీసు ప్రాంగణం అంతా కోలాహలం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో, పార్టీ కార్యాలయంలో ఉండి పనిచేసిన నేతలను చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article