బుట్టాయగూడెం.
స్థానిక త్రిశక్తి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా మహోత్సవాల నాలుగవరోజు ఆదివారం స్థానిక ఆటోమొబైల్ వ్యాపారి ఉప్పల రాంబాబు, నాగమణి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహిళా భక్తులచే కలశ గ్రామోత్సవం కన్నడ పండుగ నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఉడతా ఉమామహేశ్వరరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళా భక్తులచే కుంకుమ పూజలు చేయించారు. మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి, పూజించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కరాటం రాజగోపాల్ బాబు, జనగం రాధాకృష్ణ, నూకల కాంతినాథ్, మాటూరి ముసలయ్య, బేత సతీష్, తదితరులు పర్యవేక్షించారు.