పులివెందుల :పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ళ గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీ పంలో నూతనముగా నిర్మించిన గోశాలలో మిగిలి న పనులను పూర్తి చేయాలని మున్సిపల్ వైకాపా ఇన్చార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్,కమిషనర్ రమణారెడ్డి లు గుత్తేదారు లకు సూచించారు.ఈ సందర్భంగా గురువారం వారు గోశాలను పరిశీలించి గోశాలలో మిగిలిపో యిన పనులను తొందరగా పూర్తి చేస్తే ఈనెల 15 నుండి పట్టణంలోని ఆవులను గోశాలలో వదలడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

