Thursday, September 11, 2025

Creating liberating content

సినిమా'గీతాంజలి మళ్లీ వచ్చింది'బేగంపేట శ్మశానవాటికలో టీజర్ లాంచ్

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’బేగంపేట శ్మశానవాటికలో టీజర్ లాంచ్

అంజలి ప్రధానమైన పాత్రగా కొంతకాలం క్రితం ‘గీతాంజలి’ సినిమా వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా, సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ రూపొందింది. ఇది ప్రేతాత్మకి సంబంధించిన కథ .. ప్రేతాత్మ ప్రధానంగా నడిచే కథ. అందువలన కథకి తగినట్టుగానే ఈ సినిమాలో శ్మశానానికి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ కారణంగా ఈ సినిమా టీజర్ ను శ్మశానంలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు. తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఈ శనివారం రాత్రి 7 గంటలకు .. హైదరాబాద్ – బేగంపేట శ్మశాన వాటికలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒక రకంగా టాలీవుడ్ కి సంబంధించి సినిమా ప్రమోషన్స్ కొత్త మలుపు తీసుకున్నాయనే అనుకోవాలి. శ్రీనివాస రెడ్డి .. సత్యం రాజేశ్ .. రవిశంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article