డిసెంబర్ 21న యు.ఎస్, డల్లాస్‌లో జరిగిన గేమ్ చేంజర్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా నుంచి క్రేజీగా సాగే డోప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సాంగ్‌ను ఇండియాలో ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేశారు. డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో మరోసారి మేకింగ్‌లో తనేంటో ఈ సాంగ్‌తో ప్రూవ్ చేశారు.తమన్ కంపోజిషన్ దీనికి పెద్ద ఎసెట్‌గా మారింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం రాశారు. అలాగే తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. పాటలో అక్కడక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీ వేసిన డాన్స్ ఎంతో క్యూట్‌గా ఉంది.
ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజైన .. జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన డోప్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.