రమణయ్యగారిపల్లి గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి..
చంద్రగిరి:నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలం, రమణయ్యగారిపల్లి పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి చెవిరెడ్డి లక్ష్మిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి బుధవారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆదరించి,ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని
అభ్యర్థించారు.ముందుగా గ్రామ దేవత సత్యమ్మకు పూజ నిర్వహించి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు.మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరని,అలాగే రాజకీయ రూపురేఖలే మార్చగలరని తెలిపారు.జగనన్న 2019లో గెలిచిన వెంటనే మహిళల సాధికారత కోసం నవరత్నాల ద్వారా మహిళల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా,చేయూత,అమ్మఒడి వంటి పథకాలు అమలుచేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు.ఇలాంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జననన్న మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీనాయకులు,కార్యకర్తలు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.
