హీరో విష్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గామి’ మూవీ టీమ్ నుంచి కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఫిబ్రవరి 29న సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదలైన తొలి ట్రైలర్‌గా గామి ట్రైలర్ నిలవనుందని ‘ఎక్స్’ వేదికగా యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై ట్రైలర్ విడుదల కానుందని, సరికొత్త అనూభూతి పొందడానికి సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలిపింది.